రూ. 3 వేల పింఛను ఇస్తాం

SMTV Desk 2019-03-25 13:38:03  3000, pension, TDP

ఎన్నికలవేళ హామీల వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా పార్టీలు కళ్లు చెదిరే వాగ్దానాలు చేస్తున్నాయి. తమను మళ్లీ గెలిపిప్తే కనీస పింఛను మొత్తాన్ని రూ. 3 వేలకు పెంచుతామని టీడీపీ హామీ ఇచ్చింది. రేపోయిపో ప్రకటించబోయే ఎన్నికల మేనిఫెస్టోలో ఈ హామీని చేర్చింది.

ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సారథ్యంలోన కమిటీ టీడీపీ మేనిఫెస్టోకు తుదిమెరుగులు దిద్దుతోంది. దాదాపు అన్ని సామాజిక వర్గాలకు లబ్ధి చేకూర్చేలా హామీలు ఇవ్వనున్నారు. తాము గెలిస్తే రూ. 3 వేల ఫింఛను ఇస్తామని వైకాపా ఇదివరకే హామీ ఇచ్చింది. అయితే ఇలాంటి ఆకర్షణీయ హామీలు మేనిఫెస్టోల వరకు రాకపోవడంతో ఎవరు ఎంత ఇస్తారన్నదానిపై స్పష్టత లేదు. గతంలో నెతకు రూ.200గా ఉండి ఫింఛను మొత్తాన్ని చంద్రబాబు రూ. 1000కి, జనవరి నుంచి రూ. 2 వేలకు పెంచడం తెలిసిందే.