కంగన షాకింగ్‌ పారితోషికం

SMTV Desk 2019-03-25 13:22:14  Kangana Raunaut, Bollywood,

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ .. జయలలిత బయోపిక్‌లో నటించబోతున్న సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు ఎ.ఎల్‌. విజయ్‌ ఈ చిత్రాని తెరకెక్కిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్‌ కథ అందిస్తున్నారు. విష్ణు వర్థన్‌ ఇందూరి నిర్మాత. తమిళ, హిందీ, తెలుగు భాషల్లో సినిమా రూపుదిద్దుకోబోతోంది. తమిళంలో ‘తలైవి’గా, హిందీలో ‘జయ’గా సినిమా విడుదల కాబోతోందని ఇటీవల విజయ్‌ ప్రకటించారు.

కాగా ఈ సినిమా కోసం కంగన తీసుకోబోతున్న పారితోషికం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఆమె భారీ మొత్తం అడిగారని సమాచారం. ఇప్పటి వరకు ఏ నిర్మాత ఓ నటికి ఇంత పారితోషికం ఇవ్వలేదని అంటున్నారు. ‘తలైవి’లో నటించేందుకు కంగన రూ.24 కోట్లు డిమాండ్‌ చేసినట్లు తెలిసింది. బహు భాషా చిత్రంగా దీన్ని తీస్తున్నందున ఆమె ఇంత మొత్తం అడిగినట్లు సమాచారం. ఈ మేరకు కంగనతో నిర్మాతలు ఒప్పందం కుదుర్చుకున్నారట.

కంగన ఇటీవల ‘మణికర్ణిక’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆమె, క్రిష్‌ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ సినిమా వివాదాలు ఎదుర్కొన్నప్పటికీ మంచి విజయం సాధించింది. వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద చక్కటి వసూళ్లు రాబట్టింది.