దీనితో తండ్రి కూడా తమ పిల్లలకు పాలివ్వచ్చు

SMTV Desk 2019-03-25 13:13:21  Dentsu , Breastfeeding dads, Japanese Device Allows Fathers to Breastfeed Their Babies

జపాన్, మార్చ్ 24: జపాన్ పరిశోధకులు ఓ విచిత్ర గాడ్జెట్‌ను తీసుకువచ్చారు. ఇటీవల టెక్సాల్‌లో జరిగిన SXSW ఫెస్టివల్‌లో జపాన్‌కు చెందిన ‘దెంత్సూ’ అనే జపాన్ సంస్థ ఈ గ్యాడ్జెట్‌ను తయారు చేసింది. పిల్లల పెంపకంలో తల్లి పాత్రలా తండ్రి పాత్ర వుండేందుకే తాము ఈ గాడ్జెట్‌ను రూపొందించినట్టు.. తండ్రులు కూడా పిల్లలతో ఎక్కువసేపు గడిపేందుకు, తల్లులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ గ్యాడ్జెట్‌ను అందుబాటులోకి తెచ్చామని సంస్థ వెల్లడించింది. స్త్రీ స్తనాలను పోలి వుంటుంది ఈ గాడ్జెట్. పాలడబ్బాకు బదులు దీనిని వాడవచ్చు.ఇందులో బిడ్డకు సరిపడా పాలను నింపుకోవాలని, దీన్ని తండ్రులు బ్యాగ్‌లా తగిలించుకుంటే సరిపోతుందని తెలిపారు. పిల్లలు ఏడ్చినప్పుడు దానిని ఛాతీకి అమర్చుకోవాలి. పిల్లలు దాన్ని చూసి తల్లి రొమ్ముల్లా భావించి పాలు తాగుతారు. ఇందులో ఒక స్తనం నుంచే పాలు వచ్చేలా ఏర్పాట్లు చేశామన్నారు. దీనికి సిలికాన్ చనుమొన ఉంటుందని అన్నారు. కాగా, దీని ధర ఎంత? మార్కెట్లోకి ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనేది ఇంకా తెలుపలేదు.