ఏడుస్తోందని బిడ్డ పెదాలకు జిగురు రాసిన ఓ కఠిన తల్లి

SMTV Desk 2019-03-25 13:12:19  mother stick her child lips, baby crying non stop, bihar

బీహార్, మార్చ్ 24: బీహార్‌లోని ఓ మహిళా దారుణానికి పాల్పడింది. తన బిడ్డ పదే పదే గుక్కపట్టి ఏడుస్తోందని నోటికి జిగురు అంటించింది. ఛాప్రా జిల్లాకు చెందిన శోభ అనే మహిళ ఈ దారుణానికి పాల్పడింది.భర్త ఆఫీస్‌కు వెళ్లాడు. ఇంట్లో బిడ్డతో సహా వుంది శోభ. ఇంతలో బిడ్డకు ఏమైందో ఏడ్వటం మొదలు పెట్టాడు. దీంతో ఆ తల్లి బిడ్డ ఏడుపుకు కారణం ఏంటో తెలుసుకుని కాసేపు లాలించి బుజ్జగిస్తే ఏడుపు మానేస్తాడు కదా. కానీ ఆ తల్లి ఆ పని చేయలేదు. చిరాకుగా జిగురును బిడ్డ పెదాలకు పూసింది. దీంతో బిడ్డ రెండు పెదాలు అతుక్కుపోయాయి. అప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన ఆమె భర్త బిడ్డ నోటి నుంచి నురగలు రావడం చూసి భార్యను ప్రశ్నించాడు. ఏడుపు ఆపడానికి తానే బిడ్డ పెదాలకు జిగురు రాసి నోటిని అతికించేశానని చెప్పింది. దీంతో షాకైన భర్త వెంటనే బిడ్డను ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. వైద్యులు బిడ్డ పెదాలకు ఉన్న జిగురును తొలగించారు. ప్రస్తుతం బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నాడు.