ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు ..

SMTV Desk 2019-03-25 12:59:01  Jobs,

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI)లో అసిస్టెంట్ డైరెక్టర్, అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 275 ఖాళీలున్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 26న ప్రారంభం అవుతుంది. FSSAI అధికారిక fssai.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి దరఖాస్తు ప్రక్రియ మార్చి 15న మొదలుకావాల్సి ఉంది. కానీ... పరిపాలనాపరమైన కారణాల వల్ల నోటిఫికేషన్ ఆలస్యంగా రిలీజైంది. ఢిల్లీ, ఘజియాబాద్, కోల్‌కతా, ముంబై, చెన్నై, గువాహతిలోని FSSAI కార్యాలయాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2019 మార్చి 26
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 ఏప్రిల్ 14