స్టార్టప్‌లకు ఏంజెల్‌ ట్యాక్స్‌ మినహాయింపు

SMTV Desk 2019-03-25 12:56:24  tax, angel tax, startups, Income tax

న్యూఢిల్లీ, మార్చ్ 24: దేశంలోని దాదాపు 120 స్టార్టప్‌లకు ఆదాయపు శాఖ ఏంజెల్‌ ట్యాక్స్‌ను మినహాయించింది. ఈ సందర్భంగా ఆయా స్టార్టప్‌లకు సమాచారాన్ని కూడా పంపించింది. ఆదాయపు పన్ను శాఖ నిర్ణయంతో ఇప్పటి ఏ షేర్‌ ప్రీమియంకు నోటీసులు అందుకొన్న సంస్థలు ఈ మినహాయింపు దృవీకరణను తీసుకొని పన్ను అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. మొత్తం 150 సంస్థలు పన్ను మినహాయింపునకు దరఖాస్తు చేసుకొన్నాయి. ఇప్పటివరకు వీటిల్లో 120 సంస్థలకు మినహాయింపులు వచ్చాయి. మిగిలిన సంస్థల దరఖాస్తులు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం స్టార్టప్‌గా గుర్తించిన సంస్థకు 10 ఏళ్లపాటు పన్నుమినహాయింపులు వర్తిస్తార.