ఆస్ట్రేలియా ఆటగాళ్ళ సరసాల వీడియో వైరల్

SMTV Desk 2019-03-25 12:54:47  Marcus Stoinis , Adam Zampa, video viral

ఆస్ట్రేలియా, మార్చ్ 24: ఆసిస్ క్రికెట్ ఆటగాళ్ళ డ్రెస్సింగ్‌రూమ్‌లో వారి చేష్టలు చర్చనీయాంశంగా మారాయి. సీస్‌-పాక్‌ వన్డే సిరీస్‌లో భాగంగా షార్జాలో శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్ అనంతరం ఇద్దరు ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. డ్రెస్సింగ్‌రూమ్‌ బాల్కనీలో ఆ జట్టు ఆటగాళ్లు మార్కస్‌ స్టోయినిస్‌, ఆడం పక్కపక్కనే కూర్చున్నారు. వెంట్రుకలు సవరించడం, ముద్దు పెట్టడానికి ప్రయత్నించడం వంటి చర్యలకు పాల్పడ్డారు. ఇదంతా అక్కడి కెమెరాలో రికార్డ్ అయింది. అయితే ఈ వీడియో ఇప్పుడు నెట్లో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో వీరి ప్రవర్తనను చూసి గేలు అని కామెంట్లు చేస్తున్నారు.