భారత జాలర్లను అదుపులోకి తీసుకున్న శ్రీలంక

SMTV Desk 2019-03-25 12:44:14  srilanka navy arrested indian fishers, srilanka navy

శ్రీలంక, మార్చ్ 24: భారత జాలర్లను శ్రీలంకా నౌకా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. డెల్ట్‌ ద్వీపం వద్ద 11 మంది భారత జాలర్లను శ్రీలంక నౌకాదళం పట్టుకుంది. విచారణ నిమిత్తం జాలర్లను కరాయ్‌నగర్‌ నౌకాదళ శిబిరానికి తరలించారు. తమిళనాడులోని రామేశ్వరం, కారాయి నగర్‌ కు చెందిన 11 మంది జాలర్లను శ్రీలంక అధికారులు అరెస్ట్ చేసినట్లు తమిళనాడు ప్రభుత్వం ధృవీకరించింది. జాలర్ల నుంచి 50పైగా వలలను శ్రీలంక నౌకాదళ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.