బిజెపి నేతలు కేవలం ధనవంతులకే కాపు కాస్తున్నారు : ప్రియాంక

SMTV Desk 2019-03-25 12:37:55  priyanka gandhi, congress party, bjp

లక్నో, మార్చ్ 24: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బిజెపి నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక యుపిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ ను బలోపేతం చేసే పనిలో ఆమె నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లడతుతూ తమను తాము చౌకీదార్లుగా చెప్పుకునే బిజెపి నేతలు దేశంలోని పేదలను పట్టించుకోవడం లేదని, వారు కేవలం ధనవంతులకే కాపుగాస్తున్నారని విమర్శించారు. యుపిలో చెరకు రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె ధ్వజమెత్తారు. చెరుకు రైతులకు ప్రభుత్వం రూ.10,000 కోట్లు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కేవలం ధనవంతులకే బిజెపి చౌకీదార్లు కాపు ఉంటున్నారని ఆమె దుయ్యబట్టారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బిజెపిని చిత్తుగా ఓడించి, కాంగ్రెస్ కు అఖండ విజయం తెచ్చి పెట్టాలని ఆమె ప్రజలను కోరారు.