91ఏళ్ళ వయస్సులో డిగ్రీ

SMTV Desk 2017-08-11 16:45:49  Thailand, Sukhothai Thammathirat Open University ,91-year-old woman, Bachelor of Arts degree, Kimlan Jinakul

థాయిలాండ్‌, ఆగస్ట్ 11: థాయిలాండ్‌కు చెందిన ఓ మహిళ చదువుకు వయస్సుతో సంబంధం లేదని రుజువు చేసి రికార్డు సృష్టించింది. 91ఏళ్ల వయస్సులో 10 ఏళ్లకు పైగా కష్టపడి ఆ దేశ రాజు దగ్గర నుండి డిగ్రీ పట్టా పొందింది. థాయిలాండ్‌కు చెందిన ఓ మీడియా కధనం ప్రకారం కిమ్లాన్ జినాకుల్ అనే మహిళకు మానవ మరియు కుటుంబ అభివృద్ధి విభాగంలో సుఖోథై తమ్మాతిరాట్ ఓపెన్ విశ్వవిద్యాలయం బ్యాచ్‌లర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ ప్రధానం చేసినట్లు సమాచారం. పట్టా పొందిన అనంతరం ఆమె మాట్లాడుతూ... మేము అధ్యయనం చేయకపోతే, మాకు ఏమి తెలియదు, ఏమి మాట్లాడ లేము, అర్ధం చేసుకోలేము అని వెల్లడించారు.