నిహారికకి విజయ్ దేవరకొండ తో పెళ్లి...క్లారిటీ ఇచ్చేశాడు !

SMTV Desk 2019-03-25 12:24:16  vijay devarakonda,

మెగా అల్లుడు కానున్న దేవరకొండ...ఇండస్ట్రీతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ న్యూస్ విని షాక్ అయ్యేవారు. ఎక్కడినుంచి పుట్టిందో తెలియదు కానీ విజయ్ దేవరకొండ, నిహారిక పెళ్లి విషయం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతూ ఉండేది. నిప్పు లేనిదే పొగ రాదు కదా అన్నట్టు ఇందులో నిజం లేకపోలేదని అభిమానులు నమ్మేవారు. పైగా నాగబాబు కూడా ఈ మధ్య నిహారిక‌కు సంబంధాలు చూస్తున్నామని మంచి సంబంధం దొరికితే క్యాస్ట్ తో సంబంధం లేకుండానే పెళ్లి చేస్తానని అంటూ స్టేట్ మెంట్ కూడా ఇచ్చాడు. దీంతో ఆ కుర్రాడు విజయ్ దేవరకొండ అని ప్రచారం జరుగుతుంది.

అయితే అందరికీ షాక్ ఇస్తూ నిన్న జరిగిన సూర్యకాంతం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నిహారికకి పెద్దన్నగా ఈ ఫంక్షన్ కి వచ్చానని చెప్పి అందరకీ షాక్ ఇచ్చాడు విజయ్. నిహారిక నాన్న నాగబాబుతో గీత గోవిందం సినిమాలో వర్క్ చేశానని ఆయనతో చేసినప్పుడు నిజంగానే ఆయన నాన్న అనే ఫీలింగ్ వచ్చిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నాగబాబు పొలిటికల్‌ గా బిజీగా ఉన్నారని, వరుణ్ తేజ్ కూడా యూఎస్‌ లో ఉండటంతో ఇక్కడకు రావడం కుదరలేదని అందుకే నాగబాబుకి కొడుకుగా నిహారికకి బ్రదర్‌ గా డ్యూటీ చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని ఆయన చెప్పుకొచ్చాడు. దీంతో ఇన్నిరోజులుగా వస్తున్న పుకార్లకి విజయ్ చెక్ పెట్టినట్టు అయ్యింది.