ప్రేమించి పెళ్ళాడిన భార్యని మరో పెళ్లి చేసుకొమ్మన్న భర్త

SMTV Desk 2017-08-11 16:29:21  HUSBEND, WIFE, SECOND MARRAGE, POLICE CASE, BOMB BLAST

హైదరాబాద్, ఆగస్ట్ 11 : ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాని తన భర్త జైలు పాలవడంతో సజావుగా కాపురం కూడా చేయలేదు. దీంతో స్వయానా ఆమె భర్త తన భార్యను మరో పెళ్లి చేసుకోమని కోరిన సంఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. నగరంలోని అంబర్ పేటకు చెందిన కలీం అనే వ్యక్తి వెల్డర్ పని చేస్తూ జీవనం కొనసాగించేవాడు. ఈ క్రమంలోనే తన 23 వ ఏట ఓ యువతిని ప్రేమించి పెళ్లాడాడు. కాని కలిసి కాపురం చేయకుండానే బాంబు పేలుడు ఘటనలో నిందితుడిగా తేలడంతో 2005 సంవత్సరంలో జైలు పాలయ్యాడు. 12 ఏళ్ళుగా జైలులోనే మగ్గుతున్న ఆయన ఐదేళ్ళ క్రితం తన భార్యను మరో పెళ్లి చేసుకొమ్మని కోరాడు. దీంతో ఆమె ఐదేళ్ల క్రితం మరో పెళ్లి చేసుకుందని కలీం బంధువు ఒకరు తెలిపారు. బాంగ్లాదేశ్ వెళ్లి హర్కత్ ఉల్ జిహాద్ అల్ ఇస్లామీ సంస్థ సభ్యులతో బాంబు పేలుళ్లకు పాల్పడిన ఘటనలో పోలీసులు అతనిపై కేసు పెట్టారు. అయితే ఇంకా ఆ కేసు ఓ కొలిక్కి రాకపోవడంతో జైలులోనే ఉంటున్న ఆయన తన భార్యను మరో పెళ్లి చేసుకోమని చెప్పడం, ఆమె మరో పెళ్లి చేసుకోవడం జరిగిపోయాయి.