పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ చిన్ని కృష్ణ

SMTV Desk 2019-03-25 11:55:51  Pawan kalyan, Chinni krishna

జ‌న‌సేన అధినేత, టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ప్ర‌ముఖ ర‌చ‌యిత చిన్ని కృష్ణ ధ్వ‌జ‌మెత్తారు. కాగా, ఇవాళ హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోగ‌ల చిన్ని కృష్ణ కార్యాల‌యంలో మీడియా స‌మావేశం జ‌రిగింది. ఈ మీడియా స‌మావేశంలో చిన్ని కృష్ణ మాట్లాడుతూ కాపుల గురించి ఎవ‌రు త‌క్కువ చేసి మాట్లాడినా ఊరుకునేది లేద‌ని, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాపుల‌పై చేసిన వ్యాఖ్య‌ల‌ను తాను ఖండిస్తున్నాన్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాపుల‌పై చేసిన వ్యాఖ్య‌ల‌తో త‌మ‌పై దాడులు జ‌రిగితే మీ అన్న చిరంజీవి వ‌చ్చి ర‌క్షిస్తాడా..? లేక నాగ‌బాబు వ‌చ్చి ర‌క్షిస్తాడా..? అని చిన్ని కృష్ణ ప‌వన్ క‌ళ్యాణ్‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

ఇక చిన్ని కీష్ణ చిరంజీవి గురించి మాట్లాడుతూ.. తాను క‌థ‌, మాట‌లు అందించిన ఇంద్ర సినిమా ఎన్నో రికార్డుల‌ను తిర‌గ‌రాసి ఇండస్ట్రీ ఆల్‌టైమ్ హిట్‌గా నిలిచింద‌ని, అంత‌టి ఘ‌న విజ‌యం సాధించిన సినిమాకు మూల‌స్థంభ‌మైన త‌న‌ను చిరంజీవి ఏ ఒక్క రోజైనా పిలిచి అన్నం పెట్ట‌క‌పోతాడా..? అని ఎదురు చూశాన‌ని, కానీ చిరంజీవి ఆ సినిమా క్రెడిట్ మొత్తాన్ని త‌న ఖాతాలోకి వ‌చ్చేలా ప్లాన్‌లు వేశార‌ని విమ‌ర్శించారు.