లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ లో ఎన్.టి.ఆర్ గా రంగస్థల నటుడు

SMTV Desk 2019-03-25 11:25:39  laksmis ntr

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ మార్చి 29న రిలీజ్ ప్లాన్ చేశారు. సైలెంట్ గా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుందని తెలుస్తుంది. మార్చి 29కి సినిమా రావడం పక్కా అంటున్నాడు ఆర్జివి. ఇక ఇంతకాలం సినిమాలో ఎన్.టి.ఆర్ పాత్రలో నటించిన నటుడి గురించి వివరాలు చెప్పని వర్మ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అతని గురించి చెప్పాడు.

లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ లో ఎన్.టి.ఆర్ గా విజయ్ కుమార్ అనే రంగస్థల నటుడు నటించాడట. తన సినిమాల్లో కాస్టింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే వర్మ అచ్చుగుద్దినట్టుగా ఎన్.టి.ఆర్ లా ఉండే విజయ్ కుమార్ ను లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ కోసం సెలెక్ట్ చేశాడట. సినిమా మొదలుపెట్టడానికి రెండు నెలలు ముందుగానే అతనికి ట్రైనింగ్ ఇచ్చారట.

బాలకృష్ణ చేసిన ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాల్లో కొన్ని చోట్ల బాలయ్య కనిపించాడు.. కాని వర్మ చేస్తున్న లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ లో మాత్రం ఆ ఛాన్స్ లేదు. అందుకే ఎప్పుడు ఇలాంటి సినిమాలకు వర్మ కొత్త వాళ్లను ప్రిఫర్ చేస్తాడు.