ప్రకాష్ రాజ్ ఆస్తుల వివరాలు

SMTV Desk 2019-03-25 11:14:24  Prakash raj,

గత కొన్ని నెలలుగా ట్విట్టర్ వేదికగా ‘జస్ట్ అస్కింగ్’ అంటూ కేంద్రప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్న ప్రకాశ్ రాజ్ ఆస్తుల విలువ రూ.31 కోట్లు. తన నామినేషన్‌తో పాటు ప్రకటించిన అఫిడవిట్‌లో ఆస్తి వివరాలను ఆయన వెల్లడించారు.

తన వద్ద మొత్తం రూ.26.59 కోట్ల విలువైన స్థిరాస్థులు, రూ.4.93 కోట్ల చరాస్తులు ఉన్నాయని ప్రకాశ్ రాజ్ తెలిపారు. 2018లో సినిమాల్లో నటించడం ద్వారా రూ.2.40 కోట్ల ఆదాయాన్ని పొందానని, వివిధ బ్యాంకుల్లోని ఖాతాల్లో రూ.25 వేల నగదు, రూ.2.94 కోట్లు ఇన్వెస్ట్ మెంట్స్, రూ.1.88 కోట్ల విలువైన వాహనాలు ఉన్నాయని తెలిపారు. ఇక ఆయన భార్య రష్మీ వర్మ పేరిట రూ.20.46 లక్షల చరాస్థి, రూ.35 లక్షల విలువైన స్థిరాస్థులతో పాటు రూ.18 లక్షల విలువైన బంగారం తదితర, విలువైన ఆభరణాలున్నాయని వెల్లడించారు.