ఆస్తుల స్వాదీనంకు ఆదేశాలు జారీ

SMTV Desk 2019-03-23 18:07:53  vijay mallya, bengulore assets occupied

న్యూఢిల్లీ, మార్చ్ 23: బ్యాంకుల్లో కోట్లు ఎగ్గొట్టిన విజయ్‌ మాల్యాకు చెందిన బెంగళూరులో ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఢిల్లీలోని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మాల్యాను ఇప్పటికే ప్రకటిత నేరగాడిగా కోర్టు పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా ఫెరా చట్టాన్ని ఉల్లంఘించిన కేసుకు సంబంధించి ఈ ఆదేశాలను ఇచ్చింది. చీఫ్‌ మెట్రోపొలిటన్‌ మేజిస్ట్రేట్‌ దీపక్‌ షెరావత్‌ ఈ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. ఇందుకు జులై10 వరకు గడువు విధించింది. ఇప్పటికే బెంగళూరు పోలీసులు దాదాపు 159 ఆస్తులను గుర్తించినట్లు న్యాయస్థానానికి తెలియజేశారు.ఫెరా చట్టం కింద జారీ చేసిన సమన్లకు స్పందించకపోవడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకొంది.