విరాట్ పై గంభీర్ సెటైర్....సీరియస్ అయిన సీఎస్కే హెడ్ కోచ్

SMTV Desk 2019-03-23 18:00:53  virat kohli, gautam gambhir, ipl, royal challengers bangalore , mahendra singh dhoni, rohit sharma, chennai super kings, csk head coach steaphen pleming

మార్చ్ 23: టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై విరాట్ స్పందిస్తూ గంభీర్ కు కౌంటర్ కూడా ఇచ్చాడు. అయితే గంభీర్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా చెన్నై సూపర్ కింగ్స్‌ హెడ్‌ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ విమర్శలు గుప్పించాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు అయినప్పటికీ.. ఒక్కరే టీమ్‌కి టైటిల్‌ను అందించలేరని గంభీర్‌కి హితబోధ చేసిన ఫ్లెమింగ్.. ఐపీఎల్‌లో టైటిల్ గెలవాలంటే చాలా అంశాలు ముడిపడి ఉంటాయని వెల్లడించాడు.‘ఒక్క ఆటగాడే ఐపీఎల్‌‌లో జట్టుని విజేతగా నిలపలేడు. ఇది చాలా క్లిష్టమైన టోర్నీ.. విజేతగా నిలవాలంటే జట్టు చాలా శ్రమించాలి. టోర్నీలోని జట్లన్నీ చాలా తెలివిగా వ్యవహరిస్తుంటాయి. ఇక ఆటగాళ్లు అంటారా..? ఐపీఎల్‌‌లో ఆరితేరి ఉంటారు. దీనికితోడు కోచ్‌, మేనేజర్లు.. ఆటగాళ్ల కొనుగోలు నుంచి తుది జట్టు ఎంపిక వరకూ లెక్కలు వేసుకుని మరీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడైనంత మాత్రానా.. ఐపీఎల్‌‌లో గెలవాలని లేదు. విజేతగా నిలవాలంటే చాలా లెక్కలుంటాయి’ అని స్టీఫెన్ ఫ్లెమింగ్ వెల్లడించాడు.