ట్రంప్‌ విక్టరీ కోసం రష్యా పనిచేసిన రష్యా!

SMTV Desk 2019-03-23 16:45:51  donald trump, america president elections 2016, russia

మార్చ్ 23: అమెరికాలో 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందన్న అంశంపై రాబర్ట్‌ ముల్లర్‌ చేపట్టిన విచారణ పూర్తి చేసి ఆ నివేదికను సమర్పించారు. ఆ నివేదికలో ట్రంప్‌ విక్టరీ కోసం రష్యా పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయిముల్లర్‌ ఇచ్చిన రిపోర్టుతో ట్రంప్‌ను అభిశంసించే అవకాశాలు ఉన్నాయని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముల్లర్‌ ఇచ్చిన నివేదిక రహస్యమైందని అటార్నీ జనరల్‌ బిల్‌ బార్‌ తెలిపారు. ఐతే త్వరలోనే ఆ నివేదికలోని అంశాలను కాంగ్రెస్‌కు వెల్లడించనున్నట్లు ఆయన చెప్పారు. రష్యాతో ట్రంప్‌కు లింకులున్నాయని డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు. వియత్నాం యుద్ధంలో పనిచేసిన ముల్లర్‌..గత రెండేళ్లు ఎన్నికల విచారణ కోసం చాలా తీవ్రంగా పనిచేశారు. ట్రంప్‌ ప్రభుత్వంలో పనిచేసిన ఆరుమందిని ఇప్పటికే వేరువేరు కారణాలతో తొలగించారు.