వైరల్ అవుతున్న రామ్ చరణ్, వరుణ్ తేజ్ సెల్ఫీ

SMTV Desk 2019-03-23 16:34:59  Viral, Ram charan, Varun Tej

మెగా బ్రదర్స్ రామ్ చరణ్, వరుణ్ తేజ్ ఓ రెస్టారెంట్ లో కలిసి దిగిన సెల్ఫీ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చరణ్ తో కలిసి దిగిన ఫోటోని బ్ర‌ద‌ర్ ల‌వ్ అనే హ్యాష్ ట్యాగ్‌ తో వ‌రుణ్ తేజ్ త‌న ట్విట్ట‌ర్‌ ఖాతాలో ఈ రోజు పోస్ట్ చేశాడు. ఈ నేప‌థ్యంలో నెటిజెన్లు పవన్ కల్యాణ్ కి హెల్ప్ చేయడానికి ఇద్దరు రావచ్చు కదా అని కొందరు ట్వీట్ చేస్తుండగా, న్యూ లుక్ లో సూపర్ గా ఉన్నారని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. కాగా, ప్రస్తుతం వాల్మీకి సినిమాతో వరుణ్ బిజీగా ఉండగా, దర్శక ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఆర్ఆర్ఆర్ అనే ప్రాజెక్ట్‌తో చరణ్ బిజీగా ఉన్నాడు.