జగన్ ఒక అరాచక శక్తి

SMTV Desk 2019-03-23 16:32:00  jagan, YS Jagan, ap cm,

ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో ఆయా పార్టీలకు చెందిన పోటీదారులు నామినేషన్ దాఖలు చేస్తున్న సంగతి తెలిసినదే..అయితే ఇక్కడున్న మూడు పార్టీలలో ముఖ్య నేతలు అయినటువంటి చంద్రబాబు,జగన్ మరియు పవన్ లు చేసిన నామినేషన్ అఫిడివిట్ లు ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి.అందులోను ప్రతి పక్ష నేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన అఫిడివిట్ విషయంలో అయితే మరీనూ.

జగన్ దాఖలు చేసినటువంటి నామినేషన్ లో మొత్తం 48 పేజీలు ఉంటే అందులో 31 పేజీలు అతనిపై ఉన్న అవినీతి కేసులే ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు టీడీపీ నేతలతో ఏర్పాటు చేసిన టెలీకాన్ఫరెన్స్ మీటింగులో సంచలన వ్యాఖ్యలు చేసారు.అలాగే జగన్ ఒక అరాచక శక్తి అనడానికి ఆ అఫిడివిట్ లో ఉన్న కేసులే నిదర్శనమని మండిపడ్డారు.ఆయన చిన్నాన్న హత్య విషయంలో కూడా రాజకీయాలు వెతకడం నీచాతి నీచమని ఫైరయ్యారు.దేశంలోని ఎవరి అఫిడివిట్ లోను ఈ స్థాయి కేసులు ఉండవేమో అని జగన్ పై రెచ్చిపోయారు.కేసుల మాఫీ కోసం జగన్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేసారని,కెసిఆర్ మరియు నరేంద్ర మోడీల దగ్గర జగన్ బానిసలా మారిపోయారని అసలు ఎవరు ఊహించని స్థాయిలో ఘాటు విమర్శలు చేసారు.