డీజిల్ ధర తగ్గింది...పెట్రోల్ ధర పెరిగింది

SMTV Desk 2019-03-23 16:27:24  Petrol, Deseal, Price, New delhi

మార్చ్ 23: అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ప్రభావంతో దేశంలో డీజిల్ ధరలు పెరుగగా...పెట్రోల్ ధరలు పెరిగాయి. ఢిల్లీలో 5 పైసలు పెరిగిన లీటర్ పెట్రోలు ధర రూ.72.81 కి చేరింది. మరోవైపు డీజిల్ ధర 5 పైసలు తగ్గి రూ.66.60 కి చేరింది. ఇక వాణిజ్య రాజధాని ముంబయిలోనూ పెట్రోలు ధర 5 పైసలు పెరిగి రూ.78.43 కి చేరగా.. డీజిల్ ధర కూడా 5 పైసలు తగ్గి రూ.69.76 వద్ద కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధర 5 పైసలు పెరిగి రూ.77.26 వద్ద.. డీజిల్ ధర 6 పైసలు తగ్గి రూ.72.41 వద్ద కొనసాగుతున్నాయి. ఇక అమరావతిలో పెట్రోల్‌ ధర రూ.76.98 ఉండగా.. డీజిల్‌ ధర రూ.71.78 వద్ద కొనసాగుతోంది.