పాక్ సర్కార్ కు మోదీ శుభాకాంక్షలు

SMTV Desk 2019-03-23 16:26:22  pakistan national day, march 23, new delhi, indian central minister, indian prime minister, narendra modi, imran khan

ఇస్లామాబాద్, మార్చ్ 23: పాక్ నేషనల్ డే సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ కు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ కు సమాధానం ఇచ్చిన ఇమ్రాన్‌ ఖాన్‌.. మోడీ గ్రీటింగ్ సందేశాన్నిరీట్వీట్‌ చేశారు. జాతీయ దినోత్స‌వం సంద‌ర్భంగా పాక్ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు చెబుతున్నాన‌ని, ఉగ్రవాద, హింస రహిత వాతావరణంలో ప్రజాతంత్ర శాంతియుత, ప్రగతిశీల శ్రేయోదాయక ప్రాంతంగా భారత్ ఉపఖండాన్ని అభివృద్ధి చేసేందుకు ఇరు దేశాలు కలిసి పని చేయాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాని మోదీ తన సందేశంలో పేర్కొన్నట్లు ఇమ్రాన్ ట్వీట్‌లో చెప్పారు. ఇరు దేశాల మ‌ధ్య ఉన్న అన్ని స‌మ‌స్య‌ల‌పై స‌మ‌గ్ర‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టాల్సిన త‌రుణం ఆస‌న్న‌మైంద‌న్నారు ఇమ్రాన్.