శతృఘ్న సిన్హాను పక్కన పెట్టిన బిజెపి

SMTV Desk 2019-03-23 16:23:01  bjp, loksabha elections, bihar constituency, central minister ravishankar prasad, Shatrughan Sinha

పట్నా, మార్చ్ 23: బిజెపి అసమ్మతి నేత శతృఘ్న సిన్హాను ఈ సారి పక్కన బెట్టి కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ను బరిలోకి దింపారు. తాజాగ బిహార్‌లో లోక్‌సభ అభ్యర్థుల జాబితాను బిజెపి విడుదల చేసింది. అయితే ఆ జాబితాలో పట్నాసాహిబ్‌ నుంచి కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ను బరిలో దింపి శతృఘ్న సిన్హాను మొండి చేయి చూపారు. రవిశంకర్‌ ప్రసాద్‌ ప్రస్తుతం బిహార్‌ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. బిహార్‌లో మొత్తం 40 లోక్‌సభ నియోజకవర్గాలుండగా.. 39 స్థానాల్లో బిజెపి అభ్యర్థులను ఖరారు చేశారు. పొత్తులో భాగంగా బిజెపి, నితీశ్‌ కుమార్‌కు చెందిన జేడీయూ చెరో 17 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. మిగతా 6 స్థానాలను లోక్‌ జనశక్తి పార్టీ కేటాయించారు. కేంద్రమంత్రులు రాధా మోహన్‌ సింగ్‌ తూర్పు చంపారన్‌ నుంచి, గిరిరాజ్‌ సింగ్‌ బెగుసరై నుంచి, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్‌ ప్రతాప్‌ రూఢీ శరణ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.