సల్మాన్ ఖాన్ @ వెంకటేష్ కూతురి పెళ్ళి

SMTV Desk 2019-03-23 13:42:42  Venkatesh, salman khan

నటుడు వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రీత వివాహం రాజస్థాన్ లోని జైపూర్‌లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ రేస్ క్లబ్ అధినేత సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో ఆశ్రీత ప్రేమ వివాహం జరుగుతున్నది. జైపూర్‌లో భారీ ఎత్తున వివాహ మహోత్సవ కార్యక్రమాలను ప్లాన్ చేశారు. దగ్గుబాటి కుటుంబంతో పాటు అక్కినేని కుటుంబం కూడా ఈ వేడుకలో సందడి చేసింది. రానా..నాగచైతన్య..సమంతలు ఈ వేడుకలో ధూమ్ ధామ్ చేశారు.