టీడీపీకి మరో షాక్

SMTV Desk 2019-03-23 12:33:07  tdp, YSRCP

ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో టీడీపీకి మరో షాక్ తగిలింది, పి.గన్నవరం నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.పులపర్తి ప్రాతినిథ్యం వహిస్తున్న పి.గన్నవరం నియోజకవర్గం టికెట్ ఆయనకు కాకుండా నేలపూడి స్టాలిన్ బాబుకు ఇవ్వడంపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు. నాన్ లోకల్ అయిన స్టాలిన్ బాబుకు ఇవ్వడంతో హర్ట్ అయిన నారాయణమూర్తి పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారట.

శుక్రవారం తన అనుచరులతో సమావేశమైన పులపర్తి నారాయణ మూర్తి టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. టీడీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో శనివారం వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. పిఠాపురం లో జరిగే ఎన్నికల ప్రచార సభలో జగన్ సమక్షంలో పులవర్తి వైసీపీలో చేరే అవకాశం ఉంది.