జయలలిత బయోపిక్ లో బాలీవుడ్ హాట్ భామ

SMTV Desk 2019-03-23 12:29:37  Kangana Ranaut,

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి.. ప్రముఖ నటి జే. జయలలిత బయోపిక్ లో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తున్నట్లు తెలస్తోంది. ఇందుకు సంబంధించి జయలలిత బయోపిక్ కు సంబంధించిన ప్రాజెక్ట్ లో కంగనా అధికారికంగా సంతకం చేసినట్లు సమాచారం అందుతుంది. తమిళనాడు ప్రజలు ఆరాధనీయమైన ఓ శక్తిగా అటు నటిగానూ.. ఇటు రాజకీయాల్లోనూ జయలలితది ప్రత్యేకమైన స్థానం. జయలలిత మృతి తర్వాత ఆమె జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తామని పలువురు సినీ ప్రముఖులు ప్రకటించారు. కానీ.. ఈ బయోపిక్ కు విష్ణు ఇందూరి తైలవి చిత్రానికి నిర్మాతగా మా

అయితే ఫిబ్రవరి 24వ తేదీ జయలలిత 71వ జన్మదినం. స్వర్గీయ జయలలిత జన్మదినాన్ని పురస్కరించుకొని దర్శకుడు ఏఎల్ విజయ్ జయలలిత బయోపిక్‌ను ప్రకటించారు. తాను రూపొందించబోయే జీవిత చరిత్రకు తలైవి అనే టైటిల్‌ను కూడా ఖారారు చేశారు. ఈ జయలలిత బయోపిక్ తలైవి సినిమాకు నిర్మాతగా విష్ణు ఇందూరి వ్యవహరిస్తున్నారు. మొత్తానికి ఇలాంటి ఎంతో పాజిటివ్ వేలో విజయేంద్రప్రసాద్ జయలలిత బయోపిక్ కు స్టోరీ అందిస్తున్నారు. బాహుబలి, మణికర్ణిక వంటి గొప్ప సినిమాలకు కథా సహాకారం అందించిన విజయేంద్ర ప్రసాద్ తలైవి సినిమాలో కూడా పనిచేస్తున్నారు. కాగా జీవీ ప్రకాశ్ సంగీతం, నిరవ్ షా సినిమాటోగ్రాఫర్‌గా, మదన్ కార్వి పాటల రచయితగా పనిచేస్తున్నారని ఇప్పటికే ఏఎల్ విజయ్ తెలిపారు కూడా. మరి కంగనా రనౌత్ జయలలిత పాత్రను పోషించనున్నట్లు త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.