పెరుగుతున్న కార్బన్ డయాక్సైడ్ ను తగ్గించేందుకు వినూత్న ప్రయోగం

SMTV Desk 2017-06-02 11:53:45  co2, reduce co2 weather, swizerland, jeniva

జెనీవా, జూన్ 2 : వాతావరణంలో పెరుగుతున్న కార్బన్ డయాక్సైడ్ ను తగ్గించేందుకు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది ఓ ప్రైవేటు సంస్థ. కార్బన్ డయాక్సైడ్ ను పీల్చుకొని కిరణ జన్య సంయోగ క్రియ ద్వారా చెట్లు ఆక్సిజన్ ను అందిస్తాయి. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ ను తగ్గించేందుకు మెుక్కల పెంపకం తప్పనిసరి.. అదే ప్రాథమిక సూత్రాన్ని అమలు చేసి సత్ఫలితాలను సాధించింది స్విట్జర్లాండ్ కు చెందిన జెబ్రుదర్ మియర్ ప్రిమానేచురా అనే సంస్థ. కృత్రిమంగా వాతావరణంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ ను సేకరించి, సాగు చేస్తున్న తోటకూర మెుక్కలకు పంపిణీ చేస్తోంది. దీంతో ఆ మెుక్కలు 30 శాతం కు పైగా అదనంగా పెరుగుతు సత్ఫలితాలు సమకూరాయి. దాంతో పాటు వాతావరణంలో కార్బన్ డైయాక్సైడ్ శాతం గణనీయంగా తగ్గిపోయింది. ఓ కంపెనీ వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ ను వేరు చేసి సేకరించడం ప్రప్రథమం. ఆ కంపెనీ వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచ మంతటా వినియోగిస్తే 2025 వరకు 1 శాతం కార్బన్ డయాక్సైడ్ ను తగ్గించేందుకు అవకాశం ఉంటుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. జూరిక్ లోని స్విస్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మేథమేటిక్స్ విశ్వవిద్యాలయం హిన్విల్ అనే గ్రామంలో క్లైమ్ వర్క్స్ పేరిట కార్బన్ డయాక్సైడ్ ను వేరు చేసే ప్లాంట్ ను ఏర్పాటు చేసింది. జెబ్రూదర్ మియర్ ప్రిమానేచురా సంస్థ ఈ యంత్రాలను ఉపయోగించి తోటకూర పెంపకానికి కార్బన్ డైయాక్సైడ్ ను వినియోగిస్తోంది. ఆ ప్లాంట్ ద్వారా ఏడాదికి 900 టన్నుల వరకు వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ ను శోషిస్తోంది.. క్లైమ్ వర్క్స్ వ్యవస్థాపకులు క్రిస్టోఫ్ గెబాల్డ, జాన్ వుర్జ్ బాచర్ లు ఈ టెక్నాలజీని 2000 ల సంవత్సరంలోనే అభివృద్ధి చేశారు. అయితే ఆ యంత్రాన్ని వాణిజ్య అవసరాలకు తోటకూర సాగులోనే మెుదటి సారి.