ఆర్సీబీ ఓపెనర్ గా ఏబీ డివిలియర్స్‌!

SMTV Desk 2019-03-23 11:56:16  ipl 2019, chennai super kings, royal challengers bengulore, virat kohli, ab de villiers

మార్చ్ 22: రేపు జరిగే ఐపీఎల్ 2019 సీజన్ కు సర్వం సిద్దమైంది. ప్రారంభ మ్యాచ్ చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య శనివారం రాత్రి 8 గంటలకి మొదలు కానుంది. అయితే బెంగళూరు హిట్టర్ ఏబీ డివిలియర్స్‌ రేపు మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2018 ఐపీఎల్ సీజన్‌లో దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ డికాక్‌తో కలిసి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా కొన్ని ఇన్నింగ్స్‌లు ఆరంభించాడు. ఆ తర్వాత డికాక్, మొయిన్ అలీ కలిసి ఆడారు. ఇలా మార్పులు చేస్తూ వెళ్లిన బెంగళూరు జట్టు.. ఏ మ్యాచ్‌లోనూ మెరుగైన ఆరంభాన్ని అందుకోలేకపోయింది. దీంతో.. ఈ ఏడాది ప్రొఫెషనల్‌ ఓపెనర్‌తో కలిసి డివిలియర్స్‌ని ఓపెనర్‌గా పంపాలనే ఆలోచనలో ఆర్సీబీ ఉన్నట్లు తెలుస్తోంది. వికెట్ కీపర్‌గా ఉన్న పార్థీవ్ పటేల్ సుదీర్ఘకాలంగా ఓపెనర్‌గా ఆడుతున్నాడు. అతను ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్ కావడంతో.. తోడుగా.. మరో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ (మొయిన్ అలీ)ని పంపడం కంటే.. కుడిచేతి వాటం హిట్టర్‌ని జోడీగా పంపాలని బెంగళూరు ఆశిస్తోంది.

బెంగళూరు జట్టు అంచనా:

పార్థీవ్ పటేల్ (వికెట్ కీపర్), ఏబీ డివిలియర్స్, మొయిన్ అలీ, విరాట్ కోహ్లీ (కెప్టెన్), సిమ్రాన్ హిట్‌మెయిర్, శివమ్ దుబే, వాషింగ్టన్ సుందర్, టిమ్ సౌథీ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్, చాహల్