అస్వస్థతకు గురైన అర్జున్ రెడ్డి

SMTV Desk 2019-03-23 11:46:11  vijay devarakonda, dear comrade, shooting, health problem

హైదరాబాద్‌‌, మార్చ్ 22: టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ అస్వస్థతకు గురయ్యారు. పని ఒత్తిడి , విరామం లేకుండా షూట్‌లో పాల్గొనడంతో ఆయన స్వల్ప అస్వస్థతకు గురయి ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని విజయ్ ఓ ఆంగ్ల పత్రికకు తెలిపారు. తాను స్వల్ప అస్వస్థతకు గురయ్యానని, చికిత్స కోసం ఆస్పత్రిలో చేరినట్టు ఆయన వెల్లడించారు. విజయ్‌ ప్రస్తుతం ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. భరత్‌ కమ్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తుంది. ఇటీవల విడుదలైన ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమా టీజర్‌కు మంచి స్పందన వచ్చింది.