మొదటి రోజే రికార్డు బ్రేక్ చేసిన ‘కేసరి’

SMTV Desk 2019-03-23 11:45:16  Kesari, Official Trailer, Akshay Kumar, Parineeti Chopra, Anurag Singh, 21st March, New movie, Bollywood movie news

ముంబయి, మార్చ్ 22: బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. తాజాగా భారీ బడ్జెట్ తో రూపొందిన ‘కేసరి’సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజే ఈ చిత్రం దేశవ్యాప్తంగా ఏకంగా రూ. 21 కోట్లు రాబట్టి, ఈ ఏడాది బాలీవుడ్ లో ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు కొల్లగొట్టిన మూవీగా నిలిచింది. 1897లో జరిగిన ‘సారాగడి’ యుద్ధం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో హవల్దార్‌ ఇషార్‌ సింగ్‌ పాత్రలో అక్షయ్‌ నటించారు. ఈ మూవీలో అక్షయ్‌ వన్‌ మ్యాన్‌ ఆర్మీగా నిలిచారు. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్ సరసన పరిణీతి చోప్రా నటించింది.