మరోసారి పొత్తుకు సిద్దమైన టీడీపీ - టీకాంగ్రెస్!

SMTV Desk 2019-03-23 11:44:17  telangana loksabha elections, tdp, congress, trs

హైదరాబాద్, మార్చ్ 22: తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో మరోసారి టీడీపీతో పొత్తు పెట్టు కునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ‌కు కాంగ్రెస్ పార్టీ నేతలు ఫోన్ చేశారు. గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా కూటమి పేరుతో నాలుగు పార్టీలు కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జనసమితిలు కలిసి పోటీ చేశాయి. ఈ కూటమికి ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాలేదు. కాంగ్రెస్ పార్టీకి 19, టీడీపీకి రెండు అసెంబ్లీ సీట్లు దక్కాయి. అయితే సీపీఐ, జనసమితికి ఒక్క సీటు కూడ రాలేదు. తెలంగాణలో ఐదు ఎంపీ సీట్లలో పోటీ చేయాలని టీడీపీ భావిస్తోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కూడ ఎల్. రమణ‌కు ఫోన్ చేశారు. అయితే ఈ రెండు పార్టీల మధ్య పొత్తుల చర్చలకు సంబంధించి శుక్రవారం సాయంత్రం చర్చలు జరిగే అవకాశం ఉంది సమాచారం.