కాంగ్రెస్‌ సంస్కృతిపై సర్జికల్‌ స్ట్రైక్‌!

SMTV Desk 2019-03-23 11:43:08  amith shah, bjp, congress party, indian airforce, indian army, balakot attack, surgical strike

న్యూఢిల్లీ, మార్చ్ 22: భారత వైమానిక దళాలు బాలాకోట్‌ పై దాడులు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ అక్కడ ఎంత మంది ఉగ్రవాదులు చనిపోయారని స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో 300 మంది చనిపోయారనడానికి సాక్ష్యాలు ఏవి అంటు కారగ్రెస్‌ నేత శ్యామ్‌ పిట్రోడా చెసిన వ్యాఖ్యలకు ఇప్పటికే అరుణ్‌ జైట్లీ ఖండించగా తాజాగా బీజేపి అధ్యక్షుడు అమిత్‌ షా కూడా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కాంగ్రెస్‌ పై ఘాట్‌ వియర్శలు చేశారు. ఏంటో ఈ విషయంలో ఆర్మీ విపక్షల వైఖరి తేలిపోయిందన్నారు. ఆర్మీ చర్యల పట్ల ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేయడంతో తేడాను గుర్తించాలని ప్రజలను కోరారు. రానున్న సార్వత్రికి ఎన్నికల్లో ప్రజలు బిజేపీకి ఓటు వేయడం ద్వారా కాంగ్రెస్‌ సంస్కృతిపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేయాలని అమిత్‌ షా పిలుపుపిచ్చారు.