ఈ నెల 25న ఉచిత వైద్య శిబిరాలు

SMTV Desk 2019-03-22 18:28:39  urban primary health center, phc, district collector yogita

వికారాబాద్‌, మార్చ్ 22: ప్రతీ నెల 3వ గురువారం అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలు ఈ నెల 25న నిర్వహించేందుకు పిహెచ్‌సీల వైద్యాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2017 నవంబరులో నాటి జిల్లా కలెక్టరు యోగితా రాణా ప్రారంభించిన ఉచిత వైద్యశిబిరాలకు విశేష స్పందన రావడంతో అన్ని పిహెచ్‌సీలు బస్తీలలో నిర్వహించే ఔట్‌ రీచ్‌ క్యాంపులను వాయిదా వేశాయి.