ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడి ప్రమాణస్వీకారం..

SMTV Desk 2017-08-11 11:01:38  VENKAYA NAYUDU, VICE PRESEDENT, PRESEDENT,

న్యూఢిల్లీ, ఆగస్ట్ 11 : 13 వ ఉపరాష్ట్రపతి, దేశంలోనే రెండవ అతిపెద్ద అత్యున్నత రాజ్యంగా పదవి అయిన ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌ హాల్‌లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. కాగా వెంకయ్య ప్రమాణ స్వీకారం హిందీలో చేయడం గమనార్హం. ఆయన చేత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, భాజపా అగ్రనేత ఎల్‌కే అద్వానీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం అనంతరం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సహా పలువురు వెంకయ్య నాయుడుకు శుభాకాంక్షలు తెలియజేశారు.