హోటల్లో రహస్య కెమరాలు...ఆన్ లైన్ లో 800మంది శృంగార వీడియోలు

SMTV Desk 2019-03-22 17:28:25  secret cameras, north Korea

మార్చ్ 22: దక్షిణ కొరియాలోని ఓ హోటల్లో రహస్య కెమేరాలను ఏర్పాటు చేసి అక్కడికి వచ్చే వారి రహస్య జీవితాలను వీడియోలో చిత్రీకరించారు ఓ ముఠా. పూర్తి వివరాల్లోకి వెళితే...కొందరు వ్యక్తులు ముఠాగాఏర్పడి వారు పథకం ప్రకారం దేశంలోని పది నగరాల్లో ఉన్న 30 వేర్వేరు హోటళ్లలోని 40 గదుల్లో ఈ కెమేరాలను అమర్చారు. మిల్లీమీటరు మందంతో ఉన్న కెమెరాలను ఎవరికీ అనుమానం రాని రీతిలో టీవీ బాక్స్‌ల్లో, వాల్‌ సాకెట్లలో, హెయిర్‌ డ్రయ్యర్‌ హోల్డర్లలో అమర్చారు. ఆ వీడియోలను అన్‌లైన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ముఠా సభ్యులు భారీమొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారు. 4వేల మందికిపైగా సభ్యులు ఉన్న ఓ వెబ్ సైట్ వాటిని ప్రత్యక్ష ప్రసారం చేసింది. వాటిని చూడటానికి సైట్ యాజమాన్యం సభ్యుల నుంచి భారీ మొత్తం వసూలు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. కాగా.. దక్షిణకొరియాలో తక్కువ ధరకే హోటల్స్ అద్దెకు దొరకుతాయి. దీంతో విదేశీయులతోపాటు స్థానికులు సైతం ఇక్కడ స్టే చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఎక్కువగా ఫ్రీడమ్ కోరుకునే కాలేజీ యూత్ వీడియోలు ఎక్కువగా రికార్డు అయినట్లు తెలుస్తోంది. దీనిని ఆ ముఠా వ్యాపారంగా మలుచుకుంది.
కాంగ్రెస్ నేతలు మునియప్ప, రమేశ్ కుమార్ మధ్య కొన్నాళ్లుగా లోక్‌సభ నియోజకవర్గం విషయమై మాటల యుద్ధం నడుస్తోంది. కోలార్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కేహెచ్ మునియప్ప ఏడుసార్లు ఎంపీగా గెలిచారు. కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. తాజాగా ఇదే స్థానం నుంచి మరోసారి లోక్ సభ బరిలోకి దిగారు. కోలార్ పార్లమెంట్ స్థానం పరిధిలోని ఓ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రమేశ్ కుమార్ కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా వ్యవహరిస్తున్నారు. మునియప్పపై పార్టీలోనూ, బయటా తీవ్రమైన ఆరోపణలున్నాయి. కుటుంబసభ్యులకు అవకాశాలు ఇస్తూ కార్యకర్తలను అన్యాయం చేస్తున్నారని పలువురు సొంత పార్టీ నేతలే ఆయనపై ఆగ్రహంగా ఉన్నారు. కోలార్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థి విషయమై మునియప్ప, రమేశ్ కుమార్ మధ్య చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి. వీరిద్దరి మధ్య వైరంపై మీడియా అడిగిన ప్రశ్నకు మునియప్ప ఆసక్తికరంగా బదులిచ్చారు. ‘రమేశ్ కుమార్‌కు, నాకు మధ్య ఎలాంటి విభేదాలు లేవు. నిజానికి మేమిద్దరం భార్య, భర్తల్లాంటి వాళ్లమని మీడియాతో మునియప్ప పేర్కొన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసి సమారు నెల రోజులు గడుస్తోంది. అయితే ఈ విషయం మీద తాజాగా స్పందించిన రమేశ్ కుమార్ నేను మగాళ్లతో పడుకోను. నాకూ ఓ లీగల్ భార్య ఉంది. ఆయనకు ఆ ఆసక్తి ఉందేమో కానీ, నాకు లేదని అంటూ అర్ధం లేని వ్యాఖ్యలు చేశారు.