ఒక పావురం ధర రూ. 10 కోట్లు

SMTV Desk 2019-03-22 17:22:38  pigeon, 10 Crores, china, This Pigeon Was Sold For Rs 10 Crore

మార్చ్, 22: చైనాలో ఓ వ్యక్తి రూ.10 కోట్లు పెట్టి ఒక పావురం కొనుగోలు చేశాడు. ఎవరైనా వారి వారి ఇష్టాల కోసం ఎంతైనా ఖర్చు పెడుతుంటారు. ఇక్కడ ఈయనకు పావురం అంటే ఇష్టం అనుకుంటా? అందుకే రూ.10 కోట్లు పోసి మరీ పావురాన్ని కొన్నాడు. ఈయన కొన్న పావురం పేరు అర్మండో. మార్చి 17న బెల్జియంలోని ఒక పీజియన్ రేసింగ్ వెబ్‌సైట్ అర్మండో‌కు వేలం నిర్వహించింది. వేలం ధర 1.4 మిలియన్ డాలర్లకు చేరింది. అంటే మన కరెన్సీలో దీని విలువ దాదాపు రూ.10 కోట్లు. జోయెల్ వెర్షూట్ ఈ పావురాన్ని విక్రయించారు. ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించి పావురాన్ని కొనుగోలు చేశారంటే.. అది ఎంత ప్రత్యేకమో మీరే ఆలోచించండి. బెల్జియం ఫాస్టెస్ట్ లాంగ్ డిస్టెన్స్ రేసింగ్ పీజియన్‌గా అర్మండో రికార్డ్ సృష్టించింది. ఇది చాలా రేస్‌లలో గెలుపొందింది. దీని వయసు ఐదేళ్లు. అంటే రిటైర్మెంట్‌కు దగ్గరిలో ఉంది. అయినా కూడా దీనికి ఇప్పటికీ చాలా విలువ ఉంది. అసాధారణమైన రెక్కల బలం, గమ్యాన్ని గుర్తించడం వంటివి అంశాలు అర్మండోను ప్రత్యేకంగా నిలిపాయి. మనకు ఈ వేలం పాట క్రేజీగా అనిపించొచ్చు. అయితే వేలంలో పావురాన్ని గెలుచుకున్న వ్యక్తికి మాత్రం అవి అత్యంత ఆనంద క్షణాలు. కార్లు, భవనాలు ఉంటేనే ధనవంతులు అవ్వలేరు.