చంద్రబాబు చాలా డ్రామాలు ఆడుతున్నాడు : జగన్

SMTV Desk 2019-03-22 17:20:40  ys jagan chandrababu, ysrcp, tdp

పులివెందుల, మార్చ్ 22: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్ష ఓట్లు చీల్చేందుకు చాలా డ్రామాలాడుతున్నారని ఆయనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. నేడు పులివెందుల ఎన్నికల ప్రచార సభలో వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ... చంద్రబాబు పార్ట్‌నర్‌ ఓ సినిమా యాక్టర్‌ అని బాబు ఎలా ఆదేశిస్తే ఆ యాక్టర్‌ అలా చేస్తాడు అని అన్నాడు. అలాగే గతంలో కాంగ్రెస్‌తో కుమ్మక్కై చంద్రబాబు కొన్ని తప్పుడు కేసులు వెయించారని గుర్తు చేసుకున్నారు. ఆ కేసు డీల్‌ చేసిన అధికారి టీడీపీ నుంచి భీమిలిలో పోటీ చేయాలనుకున్నారు. అయితే చంద్రబాబు అతడిని తన పార్టీలో చేర్చి విశాఖ నుంచి పాటీలో నిలిపాడు. నవరాత్నాలతో, పసుపు కుంకుమ పేరుతో బాబు చేస్తున్న డ్రామాలు చూస్తున్నాం అని మండిపడ్డారు. పులివెందుల గడ్డమీద పుట్టినందుకు గర్వపడుతున్నా. ఉద్యోగాల కల్పనలో చంద్రబాబు విఫలమయ్యారు. మీరు వేసే ప్రతీ ఓటు రాష్ట్ర భవిష్యత్తునే మార్చి వేస్తాయి అని అన్నారు.