భారీ వాటాలను కొనుగోలు చేయనున్న జీవీకే

SMTV Desk 2019-03-22 16:27:37  GVKs Mumbai International Airport Pvt Ltd iis a Public Private Partnership 74:26 joint venture, mumbai international airport

మార్చ్ 22: ప్రముఖ జీవీకే సంస్థ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో వాటాలు కొనేందుకు సిద్ధమైంది. ఎస్కా గ్లోబల్ కంపెనీకి రూ.924 కోట్లు చెల్లించి ఈ వాటాలను సొంతం చేసుకునేందుకు రంగం సిద్దం చేసుకోనుంది. కంపెనీ ఒక ప్రకటనలో ఈ విషయాలు వెల్లడించింది. ఎస్కా గ్లోబల్ నుంచి 10 శాతం వాటా కొనుగోలు పూర్తయితే.. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో జీవీకే గ్రూప్‌ వాటా 74 శాతానికి పెరుగుతుంది. ప్రస్తుతం జీవీకేకు ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో 50.5 శాతం వాటాలున్నాయి. జీవీకే ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్.. ఎస్కా గ్లోబల్‌ నుంచి మొత్తంగా 12 కోట్ల షేర్లను కొనుగోలు చేయనుంది. ఇందుకోసం ఒక్కో షేరుకు రూ.77 చెల్లించనుంది. ఇక వాటా కొనుగోలు నేపథ్యంలో జీవీకే పవర్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ షేరు ధర ఇంట్రాడేలో ఏకంగా 9 శాతం మేర ర్యాలీ చేశాయి. రూ.7.65 గరిష్టాన్ని తాకింది.