ఐపీఎల్ టికెట్లకు భారీ గిరాకీ

SMTV Desk 2019-03-22 15:34:55  ipl 2019, hyderabad uppal stadium, sunrisers hyderabad vs rajastan royals, ipl tickets

మార్చ్ 22: ఐపీఎల్ టికెట్టు కొనుగోలు చేయడానికి అభిమానుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. ఈ నెల 29న ఉప్పల్‌ స్టేడియంలో రాజస్థాన్‌ రాయల్స్‌తో సన్‌రైజర్స్‌ ఆడే తొలి మ్యాచ్‌ టిక్కెట్లలో ఒక్కోటి రూ.1562ల మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇదే స్టేడియంలో 31న బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌తో జరిగే మ్యాచ్‌ టికెట్లలో కొన్ని శ్రేణులకు సంబంధించిన టికెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లో ఎనిమిది టికెట్‌ విక్రయ కేంద్రాలతో పాటు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వారు అసలైన టికెట్లు పొందేందుకు నాలుగు ప్రత్యేక అవుట్‌లెట్స్‌ను ఏర్పాటు చేశారు. జింఖానా గ్రౌండ్స్‌, అసెంబ్లీ మెట్రో స్టేషన్‌, సరూర్‌నగర్‌ స్టేడియం, గచ్చిబౌలి బీడబ్స్‌లో టికెట్ల విక్రయ కేంద్రాలతో పాటు రిడెంప్షన్‌ అవుట్‌లెట్స్‌ను ఏర్పాటు చేయగా మియాపూర్‌, మూసాపేట్‌, నాగోల్‌, బేగంపేట మెట్రో స్టేషన్లలో విక్రయ కేంద్రాలను ప్రారంభించారు. వెబ్‌సైట్ః www.eventsnow.com