బ్రేకింగ్: జైషే ఉగ్రవాది అరెస్టు

SMTV Desk 2019-03-22 14:02:46  jaish, terrorist, arrest,

ఢిల్లీ: జైషే యీ మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాది సజ్జన్ ఖాన్ ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని రెడ్ పోర్టు ప్రాంతంలో సజ్జన్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్నట్టు ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ సెల్ పోలీసులు తెలిపారు. పుల్వామా దాడిలో ప్రధాన సూత్రధారిగా ఉన్న ముదసిర్ అహ్మద్ ఖాన్ కు సజ్జన్ ఖాన్ సన్నిహితుడని పోలీసులు వెల్లడించారు. దక్షిణ కశ్మీర్ లోని ట్రాల్ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ సమయంలో ముదసిర్ అహ్మద్ ఖాన్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జాతీయ దర్యాప్త సంస్థ (ఎన్ఐఎ) మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్న ముదసిర్ ఖాన్ ను ఢిల్లీలో శాలువాలు విక్రయిస్తుండగా గుర్తించి అరెస్టు చేశారు.