హత్యారాజకీయాలు చేయడం వాళ్లకు అలవాటే

SMTV Desk 2019-03-22 12:40:39  Pawan Kalyan, Janasena, ballya , YCP

వైసీపీపై హిందూపూర్ శాసనసభ టీడీపీ అభ్యర్థి, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఫైర్ అయ్యారు. హత్యారాజకీయాలు చేయడం వైసీపీ నేతలకు అలవాటేనని ఆయన మంది పడ్డారు . హిందూపురం నూగూరు ఆంజనేయస్వామి ఆలయంలో బాలయ్య దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధే టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తుందని అన్నారు.

టీడీపీకి తప్ప మరే పార్టీకి ఓటు వేసినా బీజేపీకి వేసినట్టేనని బాలయ్య చెప్పారు. హిందూపురంలో జరిగిన అభివృద్ధే మళ్లీ తనను మంచి మెజార్టీతో గెలిపిస్తుందని తెలిపారు. ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చానని అన్నారు. నియోజకవర్గంలో ఆసుపత్రిని నిర్మించి ప్రజలకు మెరుగైన సేవలు అందించానని చెప్పారు. బసవతారకం కేన్సర్ ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. కొత్త పార్టీల ప్రభావం రాష్ట్రంలో అంతగా ఉండదని చెప్పారు. ఈరోజు ఆయన నామినేషన్ వేయనున్నారు.