పవన్ కళ్యాణ్ వచ్చిన నేనే గెలుస్తా .. ఎవరున్నా నేనే గెలుస్తా .. : గంటా శ్రీనివాసరావు

SMTV Desk 2019-03-22 12:39:11  Ganta Srinivas Rao, pawan Klayan

మంత్రి గంటా శ్రీనివాసరావు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు .. ఈ నేపథ్యంలో అతను మాట్లాడుతూ..తాను పోటీ చేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఖచ్చితంగా..గెలుస్తానని..అంతేకాదు..జనసేన అధినేత పవన్ కల్యాన్ స్వయంగా వచ్చి పోటీ చేసిన..గెలుపు నాదేనని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు.. రాష్ట్రంలో జరగబోయో ఎన్నికల్లో భారీ మెజారిటీతో తాను విజయం సాధిస్తానని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ప్రచారంలో భాగంగా.. విశాఖ ఉత్తరం అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి గంటా నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు 40 ఏళ్ల అనుభవమే రాష్ట్రానికి శ్రీరామరక్ష అన్నారు. అంతేకాదు..అదే ఏపీలో మళ్లీ టీడీపీని అధికారంలోకి తీసుకొస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే తాను కూడా మంచి మేజారీటీతో గెలుస్తానని... తన గెలుపుపై ఎలాంటి అనుమానం లేదని, అందరి చూపూ ఎంత మెజార్టీ వస్తందన్న అంశంపైనే అన్నారు. ఇంతకు ముందు వచ్చిన మెజార్టీలను మించి ఈసారీ వస్తుందని, ఏపీలో టీడీపీకే ప్రజలు పట్టం కడతారని తెలిపారు.