ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ పై డోనాల్డ్ ట్రంప్ స్పందన ...

SMTV Desk 2019-03-22 12:36:10  Donald Trump, laksmis NTR,

సినిమాలను ప్రోమోట్ చేయడంలో టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌ రూటే సెపరేటు. ఆయ‌న సినిమాలు ఎప్పుడు వివాదాల చుట్టూ తిరుగుతూనే విపరీతమైన పబ్లిసిటీని పొంతుతాయి. వర్మ కూడా వినూత్న ఆలోచనలతో తన సినిమాను ప్రజల్లోకి చేరవేస్తాడు. తాజాగా ఆయ‌న తెర‌కెక్కించిన ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ మార్చి 29న విడుద‌లకు సిద్ధం అవుతోంది తాజాగా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న సినిమాపై స్పందించారంటూ మార్పింగ్ వీడియో చేసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది

ఈ వీడియోలో ట్రంప్‌ని ఓ రిపోర్ట‌ర్ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై మీ అభిప్రాయ‌మేంట‌ని ప్ర‌శ్నించ‌గా, అందుకు ఆయ‌న ఇది చ‌ర్చించాల్సిన అంశమని స్పందించారు. ప్ర‌తి ఒక్క‌రు దీని గురించే మాట్లాడుతున్నారు. అస్సలు అక్క‌డ ఏం జ‌రుగుతుందో చూడాలని ఉంద‌ని ఆయ‌న అన్న‌ట్టుగా వీడియో రూపొందించారు. గ‌తంలో ట్రంప్ ఇచ్చిన ఇంట‌ర్య్వూ వీడియోని ఫ‌న్నీగా ఇలా మార్ఫింగ్ చేసి విడుద‌ల చేయ‌డం విశేషం.