యూజర్ల పాస్ వర్డ్ లు మా ఉద్యోగులకు తెలుసు.. షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన ఫేస్‌బుక్‌

SMTV Desk 2019-03-22 12:23:31  facebook, Facebook app

ప్రపంచ ప్రఖ్యాత సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్ ఇటీవలి కాలంలో అనేక చిక్కుల్లో ఇరుకుంటోంది. ఇప్పటికే డేటా లీక్ ఆరోపణలు ఎదురుకొంటున్న ఫేస్‌బుక్. తాజాగా వినియోగదారులకు మరో షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. తమ ఖాతాదారుల పాస్‌వర్డ్‌లను ప్లెయిన్‌ టెక్స్ట్‌ లోనే సర్వర్లలో నిక్షిప్తం చేస్తామని వెల్లడించింది. కాకపోతే ఈ పాస్‌వర్డ్‌లు ఫేస్‌బుక్‌ ఉద్యోగులకు తప్ప ఇతరులకు కనిపించవని స్పష్టం చేసింది. ఇంతవరకు దుర్వినియోగం అయిన దాఖలాలు లేవని ఫేస్‌బుక్‌ ఇంజినీరింగ్‌, భద్రత, ప్రైవసీ డిపార్ట్మెంట్ వైస్ ప్రెసిడెంట్ పెడ్రో కనహౌతి తన ‘బ్లాగ్‌స్పాట్‌’లో పేర్కొన్నారు.

ప్రతి సంవత్సరం జరిపే భద్రత సమీక్షలో భాగంగా ఈ ఏడాది కూడా ఈ ఘోర తప్పిదాన్ని కనిపెట్టలేకపోయామని ఆయన నిజాయతీగా అంగీకరించారు. కాకపోతే ఈ తప్పిదం తమ దృష్టికి రాగానే ఖాతాదారులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. తమ ఉద్యోగులకు కనిపించేలా పాస్‌వర్డ్‌లు కలిగి ఉన్న ‘‘ఫేస్‌బుక్‌ లైట్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌’’ ఖాతాదారులకు త్వరలోనే ఈ విషయమై అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తామన్నారు. వారంతా వీలైతే కొత్త పాస్‌వర్డ్‌లు పెట్టుకునేలా సూచిస్తామన్నారు.