పరిటాల రవి తనయుడి వివాహ నిశ్చితార్థ వేడుక

SMTV Desk 2017-08-10 17:50:36  paritaala sunitha son engagement program

అమరావతి, ఆగస్ట్ 10 : మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరాం నిశ్చితార్థం హైదరాబాదులోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో అంగరంగ వైభవంగా జరిగింది. అనంతపురం జిల్లాకు చెందిన వ్యాపారవేత్త కుమార్తె ఆలం జ్ఞాన అనే యువతినిచ్చి వివాహం జరిపించనున్నారు. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఈ వేడుకలో సందడి చేశారు. శ్రీరామ్, జ్ఞానల వివాహం అక్టోబర్ 1వ తేదీన జరగనున్నట్లు మంత్రి సునీత ప్రకటించారు. ఈ వేడుకలో ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు దేవినేని ఉమా, అయ్యన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్, కాల్వ శ్రీనివాసులు, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, అనంతపురం జెడ్పీ ఛైర్మన్ చమన్ తదితరులు హాజరయ్యారు.