ఇండియన్ 2 ఆలస్యానికి అసలు కారణం ఇదే

SMTV Desk 2019-03-22 12:09:07  Indian 2, Kamal Haasan,

శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో సూపర్ మూవీ సీక్వల్ గా వస్తున్న ఇండియన్ 2. లైకా ప్రొడక్షన్స్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా నిర్మాతలకు శంకర్ కు మధ్య గొడవలు జరగడంతో సినిమా కొద్దిరోజులు షూటింగ్ ఆపేశారు. మరో పక్క కమల్ పాలిటిక్స్ లో బిజీగా అవడం వల్ల షూటింగ్ కు అంతరాయం కలుగుతుంది. అయితే ఇవే కాకుండా సినిమా షూటింగ్ ఆగిపోడానికి కమల్ హెల్త్ ఇష్యూ కూడా కారణమని తెలుస్తుంది.

గంటల కొద్ది ప్రొస్థెటిక్ మేకప్ వేసుకోవడం వల్ల కమల్ హాసన్ కు స్కిన్ ఎలర్జీ వస్తుందట. ఇండియన్ 2 షూటింగ్ ఆలస్యానికి అసలు కారణం ఇదే అని తెలుస్తుంది. ఇండియన్ 2 మళ్లీ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది అన్నది తెలియాల్సి ఉంది. మొదటి పార్ట్ లో లానే ఇండియన్ 2లో కూడా కమల్ హాసన్ రెండు పాత్రల్లో నటిస్తాడని తెలుస్తుంది. సినిమాలో కాజల్ హీరోయిన్ గా సెలెక్ట్ అవగా దుల్కర్ సల్మాన్, శింభు కూడా నటిస్తున్నారు.