రాం చరణ్ మెగా ప్లాన్..!

SMTV Desk 2019-03-22 12:07:22  Ram charan,

రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. వినయ విధేయ రామ తర్వాత రాం చరణ్ చేస్తున్న ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలిసిందే. 2020 జూలైలో ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అవుతుంది. ఈ ఇయర్ డిసెంబర్ కాని.. 2020 జనవరి కల్లా షూటింగ్ ముగిస్తానని చెప్పాడు రాజమౌళి. ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాం చరణ్ ఓ నూతన దర్శకుడితో సినిమా చేస్తాడట.

ఆ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఉంటుందని తెలుస్తుంది. అల్లు అరవింద్ నిర్మాణంలో రాం చరణ్ హీరోగా ఆ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ రాం చరణ్ కాంబినేషన్ లో వచ్చిన మగధీర, ధ్రువ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు హ్యాట్రిక్ కాంబోగా వస్తున్న ఈ సినిమాను నేషనల్ వైడ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఎలాగు ఆర్.ఆర్.ఆర్ తర్వాత తారక్, రాం చరణ్ లకు నేషనల్ వైడ్ క్రేజ్ వచ్చేస్తుంది కాబట్టి అరవింద్ ఈ మెగా ప్లాన్ వేశాడు.