ఎన్నికల సంఘానికి ఆ అధికారం లేదు!

SMTV Desk 2019-03-22 12:03:55  ys vivekananda reddy, YSR Congress party, former Andhra Pradesh Chief Minister YS Rajashekhara Reddys, ys sunita reddy, election commission of india, gopala krishna dwivedi

అమరావతి, మార్చ్ 21: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు ఫిర్యాదును కేంద్ర ఎన్నికల సంఘానికి నేడు సునీతారెడ్డి నివేదిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. వివేకా హత్య కేసు దర్యాప్తులో రాజకీయ జోక్యం ఉండకూడదని ఆమె కోరినట్లు స్పష్టంచేశారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా విచారణ జరగాలని కోరారన్నారు. అలాగే సిట్ దర్యాప్తుపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడించారు. వివేకా హత్యపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించే అధికారం ఎన్నికల సంఘానికి లేదని తేల్చిచెప్పారు. ఈ వ్యవహారంలో ఈసీ, రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరతామని పేర్కొన్నారు.