ప్రస్తుత రాజకీయాలకు వెంకయ్య కొత్త నిర్వచనం

SMTV Desk 2017-08-10 17:38:32  Venkaiah Naidu, BJP Minister, Tirupati, NDA Vice president, Nellore,

నెల్లూరు, ఆగస్ట్ 10: ఉపరాష్ట్రపతిగా రేపు ప్రమాణస్వీకారం చేయనున్న భాజపా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుని ఎదిగిన కొద్ది ఒదిగి ఉండాలనే నానుడికి చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇందుకు ఆయన మాట తీరే నిదర్శనం. ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్యర్థిగా ఎంపికైన దగ్గరి నుంచి ఆయన తక్కువ మాటల్లో ఎక్కువ అర్థాన్ని చెప్తున్నారు. ఇటీవల ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం రాజకీయాల్లో 3సీ లు క్యాష్‌, క్యాస్ట్‌, క‌మ్యూనిటీ ఉన్నాయి, ఇవి తొల‌గిపోయి 4సీ లు క్యారెక్ట‌ర్‌, కాలిబ‌ర్‌, కెపాసిటీ, కండ‌క్ట్‌ రావాలని ఆయన అన్నారు. గతంలో కూడా అబ్దుల్ కలాం, ఇండియా పదాలకు తనదైన అర్థం చెప్పిన ఆయ‌న, తాజాగా రాజకీయాల గురించి ఇలా నిర్వచించారు.