రాజకీయాల్లో ఎప్పటికీ చేరను : సల్మాన్

SMTV Desk 2019-03-22 11:58:43  salman khan, bollywood actor, congress party, salman entry in politics, loksabha elections

ముంబయి, మార్చ్ 21: రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ ప్రచారం చేయనున్నట్టు జోరుగా వార్తలస్తున్నాయి. అయితే ఈ వార్తలను ఆయన ఖండించారు. తాను వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, అదేవిధంగా ఏ పార్టీ తరపున ప్రచారం చేయడం లేదని ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. కాంగ్రెస్ , బిజెపిలతో సహా పలు రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెనర్ల కోసం పలువురు సినీ ప్రముఖులను సంప్రదిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సల్మాన్ ను కాంగ్రెస్ తన ప్రచారం వాడుకోవాలని ప్రయత్నించినట్టు వార్తలు వచ్చాయి. సల్మాన్ తమ వినతిని కాదనడని, తమ పార్టీ తరపున ఆయన ప్రచారం చేస్తారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పంకజ్ చతుర్వేది ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సల్మాన్ కాంగ్రెస్ నేతల ఆశలపై నీళ్లు చల్లారు. రాజకీయాల్లో తన పేరును ప్రస్తావించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.